'బాటిల్ క్యాప్ ఛాలెంజ్'.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ సందడి చేస్తోంది. క్రీడాకారులు, నటులు ఈ ఛాలెంజ్ చేస్తూ మరికొంత మందికి సవాల్ విసురుతున్నారు. తాజాగా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి పూర్తి చేశాడు.
ఇంతకుముందు యువరాజ్ సింగ్ 'బాటిల్ క్యాప్ ఛాలెంజ్' చేసి ధావన్‌కు సవాల్ విసిరాడు. ప్రపంచకప్‌లో గాయం కారణంగా కొద్దిరోజులుగా బ్యాట్ పట్టని శిఖర్ ప్రస్తుతం కోలుకున్నాడు. యువీ ఛాలెంజ్ స్వీకరించి ట్విట్టర్లో ఆ వీడియోను పోస్ట్ చేశాడు. 'గాయం తర్వాత మొదటి సారి బ్యాట్ పట్టా. ఇదిగో యువీ పాజీ.. నా ఛాలెంజ్' అంటూ రాసుకొచ్చాడు.