బిగ్‌బాష్ లీగ్‌లో రోజుకో విషయం చర్చనీయాంశంగా మారుతోంది. టాస్ కోసం కాయిన్ బదులు బ్యాట్ ఉపయోగించి అభిమానులను ఆకట్టుకోగా.. ఇటీవల బౌండరీ వద్ద ఓ క్యాచ్ వివాదాస్పదమైంది. తాజాగా ఓ బ్యాట్స్‌మన్ కొట్టిన షాట్‌కు అతడి బ్యాట్ రెండు ముక్కలైంది. ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.
ఏమైంది?
జనవరి 10న... మెల్‌బోర్న్ రెనిగేడ్స్-మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య మ్యాచ్ జరిగింది. రెనిగేడ్స్ బ్యాట్స్‌మన్ షాన్ మార్ష్ బ్యాటింగ్.స్టార్స్ జట్టు బౌలర్ లాన్స్ మోరిస్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్ ఐదో బంతిని మార్ష్ ఎదుర్కొన్నాడు. 139 కి.మీ సాధారణ వేగంతో వచ్చిన బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బ్యాట్ రెండు ముక్కలైంది. ఆ తర్వాత కొత్త బ్యాట్‌ను తెప్పించుకున్న మార్ష్ సత్తాచాటాడు. స్టార్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 43 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఫలితంగా రెనెగేడ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.
సాధారణ లక్ష్యంతో బరిలోక దిగిన స్టార్స్... 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 45 బంతుల్లో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 1 ఫోర్, 7 సిక్సర్లు ఉండటం విశేషం.
ఇవీ చూడండి...