బిగ్‌బాష్ లీగ్‌లో ఆఫ్గానిస్థాన్ యువ క్రికెటర్ రషీద్‌ఖాన్ విభిన్నమైన బ్యాట్‌తో ఆకట్టుకున్నాడు. ఒంటె మూపురం ఆకారంలో ఉండే డిజైన్ కలిగిన బ్యాట్‌ను వినియోగించాడు. క్యామెల్ బ్యాట్‌గా పిలిచే ఈ విభిన్నమైన బ్యాట్.. నెట్టింట వైరల్‌గా అవుతోంది.
ఆల్‌రౌండర్ ప్రదర్శన...
ఆదివారం మెల్బోర్న్ రెనెగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అడిలైడ్ స్ట్రైకర్స్ క్రికెటర్ రషీద్‌ఖాన్. బ్యాట్స్‌మన్‌గా 25 పరుగులతో( 16 బంతుల్లో; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. అంతేకాకుండా ఫిలిఫ్ సాల్ట్(54), అలెక్స్ కేరీ(41) చక్కటి ప్రదర్శనతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు.
అనంతరం లక్ష్య ఛేదనలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేయగలిగింది మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టు. ఆరోన్ ఫించ్(50), వెబ్‌స్టర్(37)మాత్రమే రాణించారు. బౌలింగ్‌లో రషీద్, వెస్ అగర్, క్యామరాన్ చెరో రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఫలితంగా అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
-
The @rashidkhan_19 masterclass continues! Another Renegades wicket down #BBL09 pic.twitter.com/sKlfRoGQ9z
— KFC Big Bash League (@BBL) December 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The @rashidkhan_19 masterclass continues! Another Renegades wicket down #BBL09 pic.twitter.com/sKlfRoGQ9z
— KFC Big Bash League (@BBL) December 29, 2019The @rashidkhan_19 masterclass continues! Another Renegades wicket down #BBL09 pic.twitter.com/sKlfRoGQ9z
— KFC Big Bash League (@BBL) December 29, 2019
రషీద్... కెరీర్లో ఇప్పటివరకు 4 టెస్టులు, 70 వన్డేలు, 45 టీ20లు ఆడాడు. ఈ మూడు ఫార్మాట్లలో 1160 రన్స్ చేయగా... 240 వికెట్లు తీశాడు.
ఇదీ చదవండి...