పరస్ఫర విరుద్ధ ప్రయోజనాల అంశంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌరభ్ గంగూలీకి ఊరట లభించింది. బీసీసీఐ నైతిక నియమావళి అధికారి డీకే జైన్.. గంగూలీపై వేసిన కేసును కొట్టివేశారు.
గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత(అక్టోబరు) క్యాబ్ పదవికి రాజీనామా చేయడం వల్ల అతడు విరుద్ధ ప్రయోజనాల అంశం కిందికి రాడని చెప్పారు డీకే జైన్.
బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) అధ్యక్షుడిగా ఉంటూ.. బీసీసీఐ ఏజీఎమ్లోనూ సభ్యుడిగానూ దాదా ప్రాతినిధ్యం వహించాడని అక్టోబరు 4న మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ జీవితకాలం సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేశాడు.
బీసీసీఐ రాజ్యంగం ప్రకారం ఎవరూ.. ఏక కాలంలో ఏ వ్యక్తి అయినా ప్రయోజనాలు పొందే రెండు పదవుల్లో ఉండేందుకు ఆస్కారం లేదు.
ఇదీ చదవండి: పింక్ బంతులు.. పైనుంచి రానున్నాయి..!