మరికొన్ని రోజుల్లో ప్రపంచకప్ మొదలవబోతోంది. అన్ని జట్లు ముమ్మర సాధనలో మునిగిపోయాయి. భారత్ ఆటగాళ్లు మాత్రం ఇప్పుడిప్పుడే ఐపీఎల్ టోర్నీ నుంచి బయటకొస్తున్నారు. ఈ తరుణంలో భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. ధోనిపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
మైదానంలో మిస్టర్ కూల్ అని పేరు తెచ్చుకుని.. వేగంగా వ్యూహాలు మార్చి జట్టుకు అనేక విజయాలనందించాడు టీమిండియా మాజీ సారథి మహీంద్ర సింగ్ ధోని. అలాంటి ధోని కూడా తప్పులు చేస్తాడని, అతడి సూచనలు చాలాసార్లు పనిచేయలేదని భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. ముంబయిలో సోమవారం జరిగిన సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డుల వేడుకలో కుల్దీప్ ఈ వ్యాఖ్యలు చేశాడు.