మన్కడింగ్ చేసినందుకు పశ్చాత్తాపం చెందట్లేదని పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. నిబంధనల ప్రకారమే నడుచుకున్నట్లు స్పష్టంచేశాడు. క్రీజులో నుంచి కదిలే ముందు బ్యాట్స్‌మెన్ జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.
రాజస్థాన్, పంజాబ్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో బట్లర్‌ను మన్కడింగ్ ద్వారా ఔట్ చేశాడు అశ్విన్. 13వ ఓవర్లో.. బౌలర్ ఎండ్‌లో ఉన్న బట్లర్ రన్ తీసేందుకు క్రీజులో నుంచి ముందుకు కదిలాడు. వెంటనే ఎలాంటి హెచ్చరిక చేయకుండానే రనౌట్ చేశాడు అశ్విన్. క్రికెట్ నిబంధనలకు ఇది వ్యతిరేకం కాకపోయినప్పటికీ క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పంజాబ్ కెప్టెన్‌పై విమర్శలు వచ్చాయి.