అఫ్గానిస్థాన్ వికెట్‌కీపర్ అఫ్జర్ జజాయ్‌కు ప్రమాదం తప్పింది. వేరొక వాహనాన్ని ఢీకొని, అతడి కారు ముందు భాగం నుజ్జునుజ్జ అయింది. ఈ ఘటనలో జజాయ్ తలకు చిన్నగాయమే కావడం వల్ల అంతా ఊపిరిపీల్చుకున్నారు. జర్నలిస్ట్, అఫ్గానిస్థాన్ మాజీ మీడియా మేనేజర్ ఇబ్రహీం మహ్మద్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. సంబంధిత ఫొటోల్ని పంచుకున్నారు.
ప్రమాదంలో వికెట్‌కీపర్ కారు నుజ్జు నుజ్జు
ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో అఫ్గాన్ వికెట్ కీపర్ అఫ్జర్ జజాయ్, చిన్నచిన్న గాయాలతో బయటపడ్డాడు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
వికెట్ కీపర్ అఫ్జర్ జజాయ్
జజాయ్.. అఫ్గాన్ తరఫున 17 వన్డేలు, ఓ టెస్టు, టీ20 ఆడాడు. 2013లో అరంగేట్రం చేసిన ఈ వికెట్ కీపర్.. గతేడాది వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో చివరగా కనిపించాడు. స్టార్ క్రికెటర్ మహ్మద్ షెహజాద్, జట్టులో ఉండటం వల్ల ఇతడికి ఆడే అవకాశం ఎక్కువగా రాలేదు.
ఇవీ చదవండి: