తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెస్టులకు ప్రముఖ పాక్​ బౌలర్ వీడ్కోలు

పాకిస్థాన్ పేసర్ మహ్మద్​ ఆమిర్ టెస్టు క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. దేశం తరఫున వన్డే, టీ20ల్లో రాణించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు.

టెస్టులకు ప్రముఖ పాక్​ బౌలర్ వీడ్కోలు

By

Published : Jul 26, 2019, 4:55 PM IST

పాకిస్థాన్ లెఫ్ట్​ ఆర్మ్ పేసర్ మహ్మద్ ఆమిర్.. పరిమిత ఓవర్ల క్రికెట్​లో మరింత మెరుగ్గా రాణించేందుకు టెస్టు క్రికెట్​కు శుక్రవారం వీడ్కోలు పలికాడు. అనంతరం ఈ విషయంపై స్పందించాడు ఈ పేస్ బౌలర్.

టెస్టు బౌలర్​గా మహ్మద్​ ఆమిర్

"సంప్రదాయ క్రికెట్​లో పాకిస్థాన్ తరఫున ఆడటం నాకెంతో గర్వకారణం. పరమిత ఓవర్ల క్రికెట్​లో రాణించేందుకే ఈ ఫార్మాట్​కు వీడ్కోలు పలికాను. ఈ విషయంపై బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నా. త్వరలో టెస్టు ఛాంపియన్​షిప్ ప్రారంభం కానుంది. కాబట్టి టెస్టు జట్టులో కుర్రాళ్లకు అవకాశం దక్కాలంటే ఇప్పుడు నేను తప్పుకోవాలని అనుకున్నాను. టెస్టుల్లో నాతో పాటు ఆడిన సహచరులు, ప్రత్యర్థులకు ధన్యవాదాలు." -మహ్మద్ ఆమిర్, పాక్ క్రికెటర్

27 ఏళ్ల ఆమిర్.. ఇప్పటివరకు 36 టెస్టుల్లో 119 వికెట్లు దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు 59 వన్డేల్లో, 49 టీ20ల్లో పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

మహ్మద్​ ఆమిర్ టెస్టు గణాంకాలు

ఇది చదవండి: అమ్మ చెప్పింది... పాక్​ బౌలర్ మహ్మద్​ ఆమిర్ భావోద్వేగం!

ABOUT THE AUTHOR

...view details