ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌కు ఓ అభిమాని నుంచి వింత అనుభవం ఎదురైంది. బంతిని గింగిరాలు తిప్పుతూ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టిన ఈ బౌలింగ్ మాంత్రికుడికి.. 'స్పిన్‌ను అర్థం చేసుకో' అని సూచించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
సౌథాంప్టన్ వేదికగా ఇండియా-కివీస్ మధ్య జరుగుతోన్న డబ్ల్యూటీసీ మ్యాచ్‌లో తొలుత స్పిన్నర్‌కు తుది జట్టులో అవకాశమిచ్చింది న్యూజిలాండ్. వర్షం కారణంగా తొలి రోజు ఆట జరగలేదు. కనీసం టాస్ కూడా పడలేదు. వాతవరణం మబ్బులు పట్టి ఉండడం వల్ల.. ఉన్నా స్పెషలిస్ట్ స్పిన్నర్ అజాజ్ పటేల్‌ను పక్కన పెట్టి.. నలుగురు పేసర్లతో బరిలోకి దిగింది కేన్ సేన. దీనిపై ఆసీస్ మాజీ.. ట్విట్టర్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశాడు. వికెట్ స్పిన్‌కు అనుకూలిస్తుందని.. స్పిన్నర్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం అసంతృప్తికి గురి చేసిందని తెలిపాడు.