మ్యాచ్ జరుగుతుండగానే మైదానంలోకి ప్రవేశించి ఫేవరెట్ ఆటగాళ్ల దగ్గరకు అభిమానులు వెళ్తుండటం ఇప్పటికే పలుమార్లు చూశాం. రాంచీ వేదికగా టీమ్ఇండియా, న్యూజిలాండ్ మధ్య రెండో టీ20 మ్యాచ్లో(IND vs NZ t20) భాగంగా ఇలాంటి సంఘటన మరోసారి వెలుగుచూసింది. ఓ అభిమాని (rohit sharma fan) నిబంధనలు ఉల్లంఘించి, భద్రతా సిబ్బందిని దాటుకొని టీమ్ఇండియా టీ20 జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గరకు పరుగెత్తాడు.
సిబ్బంది కళ్లుగప్పి..
కొవిడ్ దృష్ట్యా కఠిన బయోబబుల్ నిబంధనల నడుమ మ్యాచ్లు సాగుతున్నాయి. అయితే.. కట్టుదిట్టమైన సిబ్బంది ఉన్నప్పటికీ రోహిత్ శర్మ కాళ్లను తాకేందుకు ఓ అభిమాని మైదానంలోకి పరుగులు తీయడం అందరి దృష్టిని ఆకర్షించింది.
రోహిత్ కాళ్ల దగ్గర దండం పెడుతూ మైదానంలో పడుకున్నాడు వీరాభిమాని. వెంటనే లేచి మళ్లీ స్టేడియంలోకి పరుగెత్తాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.