తెలంగాణ

telangana

ETV Bharat / sports

బీసీసీఐకి వేదా కృష్ణమూర్తి ఎమోషనల్ మెసేజ్

బీసీసీఐ కార్యదర్శి జై షాకు ధన్యవాదాలు తెలిపింది భారత మహిళా క్రికెటర్​ వేదా కృష్ణమూర్తి. కొవిడ్ కారణంగా తన తల్లి, అక్కను కోల్పోయిన సమయంలో తనకు మద్దతుగా నిలిచారని పేర్కొంది.

veda krishna murthy, indian cricketer
వేద కృష్ణమూర్తి, భారత మహిళా క్రికెటర్

By

Published : May 18, 2021, 4:07 PM IST

దుఃఖ సమయంలో తనకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)తో పాటు కార్యదర్శి జై షా.. అపూర్వ మద్దతు తెలిపారని మహిళ క్రికెటర్​ వేదా కృష్ణమూర్తి పేర్కొంది. కరోనా మహమ్మారికి ఇటీవల తన తల్లిని, సోదరిని కోల్పోయిన వేద.. కష్టకాలంలో అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ ఈమేరకు ట్వీట్ చేసింది.

"ఇది చాలా ఇబ్బందికరమైన సమయం. గత నెల రోజులుగా నేను, మా కుటుంబం చాలా కఠినంగా గడుపుతున్నాం. ఈ దుఃఖ సమయంలో మాకు మద్దతుగా నిలిచిన బీసీసీఐతో పాటు కార్యదర్శి జై షాకు ధన్యవాదాలు" అని వేద ట్వీట్ చేసింది.

ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో వేదకు స్థానం కల్పించలేదు సెలెక్షన్ కమిటీ. కొవిడ్​తో తన తల్లి, అక్క మరణిస్తే.. బీసీసీఐ కనీసం తనను పరామర్శించిందా అంటూ ఆసీస్ కెప్టెన్ లీసా స్థలేకర్​ విమర్శించింది. జట్టు ఎంపిక నుంచి తనను తప్పిస్తున్నట్లు వేదకు చెప్పారా అని స్థలేకర్​ ప్రశ్నించింది.

ఇదీ చదవండి:బాల్ ట్యాంపరింగ్ రగడపై బాన్​క్రాఫ్ట్ వెనకడుగు!

ABOUT THE AUTHOR

...view details