గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మూడు నెలలు మైదానాన్ని వీడనున్నాడు. ఎక్స్‌రే, సిటీ స్కాన్ తీయించుకోగా అతడి గాయం తీవ్రత ఎక్కువని ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని తేలింది. ఇందుకోసం స్టోక్స్ స్వదేశానికి రానున్నాడని ఇంగ్లీష్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. సోమవారం లీడ్స్‌లో ఇతడు శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు.
స్టోక్స్‌కు సర్జరీ.. మూడు నెలలు క్రికెట్‌కు దూరం
గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఆపరేషన్ కోసం స్వదేశానికి పయనమవనున్నాడు. చికిత్స తర్వాత మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరమవనున్నాడని ఇంగ్లీష్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
స్టోక్స్
ఈ కారణంగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో జూన్ 2న ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌కు స్టోక్స్ దూరమయ్యే అవకాశం ఉంది.
పంజాబ్‌తో మ్యాచ్‌లో మొదట ఒక క్యాచ్ వదిలిపెట్టిన స్టోక్స్.. ఆ తర్వాత గేల్ ఇచ్చిన క్యాచ్‌ను డైవ్ చేస్తూ పట్టాడు. కానీ వెంటనే చేతిని విదిలించుకుంటూ ఇబ్బందిగా కనిపించాడు. ఆ తర్వాత అలాగే ఫీల్డింగ్, బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్‌లో ఓపెనర్‌గా దిగి ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఔటయ్యాడు.