ఐపీఎల్లో ఆడి, స్వదేశానికి తిరిగొచ్చిన ఆసీస్ క్రికెటర్ల క్వారంటైన్ బిల్లును భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) చెల్లించనుందని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఆటగాళ్లతో పాటు వ్యాఖ్యాతలు, కోచ్లు కలిపి మొత్తం 38మంది లీగ్లో పాల్గొన్నారు. మాల్దీవుల నుంచి ఆస్ట్రేలియా చేరుకున్న వీరంతా.. సిడ్నీలో 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్లో ఉండనున్నారు.
"క్రికెటర్లను సురక్షితంగా స్వదేశానికి చేరవేసింది బీసీసీఐ. తప్పనిసరి నిర్బంధంలో ఉన్న ఆసీస్ ఆటగాళ్ల క్వారంటైన్ బిల్లును కూడా చెల్లిస్తుంది. మేము వారితో కలిసి పనిచేస్తున్నాం. భారత క్రికెట్ బోర్డు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది."