తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ సన్నిహితుడే కాబోయే ప్రధాన కోచ్! - జాతీయ క్రికెట్​ అకాడమీ

టీమ్​ఇండియా ప్రధాన కోచ్​ పదవికి ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది. అతడు ప్రస్తుత హెడ్ కోచ్ రవిశాస్త్రి, సారథి విరాట్​ కోహ్లీకి అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది.

Team India's Next Coach
రాహుల్ ద్రవిడ్​

By

Published : Aug 24, 2021, 5:32 AM IST

టీమ్​ఇండియా తదుపరి ప్రధాన కోచ్​ ఎవరనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం హెడ్​కోచ్​గా ఉన్న రవిశాస్త్రి.. పదవీకాలం ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​ అనంతరం ముగుస్తుంది. రాహుల్ ద్రవిడ్​ ఆ పదవి చేపట్టే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది. బ్యాటింగ్​ కోచ్ విక్రమ్​ రాథోడ్​ను ప్రధాన కోచ్​ పదవి వరించే అవకాశం కనబడుతోంది.

అక్టోబరు-నవంబరులో రవిశాస్త్రి పదవీ కాలం ముగుస్తుండగా.. మరోసారి ఆ పదవి చేపట్టబోనని ఆయన ఇదివరకే సంకేతాలిచ్చినట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం జాతీయ క్రికెట్​ అకాడమీకి డైరెక్టర్​గా ఉన్న ద్రవిడ్​ పదవీ కాలం కూడా త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఆ పదవికి బీసీసీఐ ప్రకటన జారీచేయగా.. ద్రవిడ్ మరోసారి దరఖాస్తు చేసకున్నాడు. దీంతో రవిశాస్త్రి సహా కెప్టెన్​ విరాట్​ కోహ్లీకి సన్నిహితుడిగా పేరున్న విక్రమ్​ రేసులోకి వచ్చాడు.

విక్రమ్​ తదుపరి ప్రధాన కోచ్​ అయితే జట్టులో మంచి సమన్వయం ఏర్పడుతుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దీనిపై బీసీసీఐ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇదీ చూడండి:ద్రవిడ్​ ఎన్​సీఏలో కోచ్​లకు 'కొత్త పాఠాలు'

ABOUT THE AUTHOR

...view details