తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒకే ఇన్నింగ్స్​లో ఆరుగురు డకౌట్.. 'బంగ్లా' ఆల్​టైం చెత్త రికార్డ్ - బంగ్లాదేశ్​ క్రికెట్​ టీమ్​ చెత్త రికార్డు

Bangladesh Team Worst Record: వెస్టిండీస్​తో టెస్ట్​ సిరీస్​లో భాగంగా.. తొలి మ్యాచ్​లో బంగ్లాదేశ్​ జట్టు ఆల్​టైం చెత్త రికార్డును నమోదు చేసింది. మొదటి ఇన్నింగ్స్​లో ఆరుగురు బంగ్లా జట్టు బ్యాటర్లు డకౌటయ్యారు. కాగా, మే నెలలో శ్రీలంకతో జరిగిన టెస్ట్​ మ్యచ్​లోనూ ఇలాంటి చెత్త రికార్డే తన ఖాతాలో వేసుకుంది.

Bangladesh Team Worst Record
Bangladesh Team Worst Record

By

Published : Jun 17, 2022, 12:41 PM IST

Bangladesh Team Worst Record: ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఆంటిగ్వాలో గురువారం ప్రారంభమైన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో 32.5 ఓవర్లలో కేవలం 103 పరుగులకే కుప్పకూలింది. కరీబియన్ బౌలర్ల ముందు బంగ్లాదేశ్​ బ్యాటర్లు తేలిపోయారు. ఆ జట్టులోని ఏకంగా ఆరుగురు బ్యాటర్లు ఒక్క పరుగు చేయకుండానే డకౌట్​ అయ్యి పెవిలియన్‌కు చేరారు.

కెప్టెన్‌ షకీబ్ అల్ హసన్ మాత్రమే 51 పరుగులు చేసి తన జట్టుకు కాస్త స్కోరును అందించాడు. బంగ్లాలో డకౌట్‌గా వెనుదిరిగిన ఆటగాళ్లలో ముగ్గురు టాప్​ఆర్డర్‌ బ్యాటర్లు ఉండడం గమనార్హం. మహ్మదుల్ హసన్ జాయ్, నజ్ముల్ శాంటో, మోమినుల్ హక్ వంటి అగ్రశేణి ఆటగాళ్లతో పాటు నురుల్ హసన్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీద్ అహ్మద్ ఈ జాబితాలో ఉన్నారు. వెస్టిండీస్‌ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, జైడెన్ తలో 3 వికెట్లు తీయగా.. కీమర్ రోచ్, కైల్ మేయర్స్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు.

3 సార్లు బంగ్లానే.. ఈ ఏడాది మే 23న శ్రీలంకతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లోనూ బంగ్లాదేశ్‌ ఇలాంటి చెత్త రికార్డే నమోదు చేసింది. మీర్పుర్​ వేదికగా జరిగిన ఆ టెస్ట్‌లోనూ ఆరుగురు ఆటగాళ్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆ మ్యాచ్​లో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. నెల తిరగకుండానే మరోసారి ఇలాంటి చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అంతకుముందు ఓ సారి కూడా ఒక మ్యాచ్​లో ఆరుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇలా ఏడుసార్లు జరగ్గా.. అందులో మూడు సార్లు బంగ్లాదేశ్​ ఉంది.

ఇవీ చదవండి:వన్డేల్లో ట్రిపుల్​ సెంచరీ.. ఆసీస్​ అంధ క్రికెటర్ వరల్డ్​ రికార్డ్​

'నన్ను ఒంటరి చేసి హింసించారు'.. మాజీ కోచ్‌పై మరో సైక్లిస్ట్​ ఆరోపణలు

ABOUT THE AUTHOR

...view details