టీ20 ప్రపంచకప్‌లో మాజీ ఛాంపియన్ పాకిస్థాన్ ఆటతీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. రెండు వరుస ఓటములతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న ఆ జట్టుపై.. మాజీలు విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ బాబర్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.. బాబర్ బ్యాడ్ కెప్టెన్ అంటూ మండిపడ్డాడు.
'మీకు ఆటను అర్థం చేసుకోవడం ఎందుకు కష్టంగా ఉందో నాకు తెలియడం లేదు. మన టాప్, మిడిల్ ఆర్డర్‌తో మనం పెద్ద విజయాన్ని సాధించగలమని మళ్లీ చెబుతున్నాను. అయితే.. నిలకడగా గెలవలేకపోతున్నాము. పాక్ జట్టుకు బ్యాడ్ కెప్టెన్ ఉన్నాడు. తన ఆట తీరుతో పాక్.. ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. మనం ఇటీవల ఓడిన మ్యాచ్‌ల్లో నవాజే చివరి ఓవర్ వేశాడు' అని అక్తర్ తన యూట్యూబ్ ఛానల్‌లో విశ్లేషించాడు.