Ricky ponting on WTC final : టీమ్ఇండియాకు ఆస్ట్రేలియాకు మధ్య జూన్ 7 నుంచి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్‌లోని ఓవల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో అంచనాలు ఇప్పటికే పెరిగిపోయాయి. ఇరు జట్లు సైతం పట్టుదలగా నెట్ ప్రాక్టీస్‌లు చేస్తూ కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగనున్న మ్యాచ్‌లో గెలవాలంటే ఈ ఇద్దరిని ఆస్ట్రేలియా బౌలర్లు కట్టడి చేయాలని ఆస్ట్రేలియా టీమ్ ప్లేయర్ రిక్కీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు. భారత సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారాని ఆస్ట్రేలియా బౌలర్లు కట్టడి చేయాలని అన్నాడు.
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023 సీజన్ 16లో ఆర్సీబీ టీమ్‌కు చెందిన టీమ్ఇండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ.. జరిగిన అన్నీ మ్యాచ్‌ల్లో తనదైన స్టైల్లో ఆడి.. రెండు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలను తన ఖాతాలోకి వేసుకున్నాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మరోవైపు ఛతేశ్వర్ పుజారా కూడా ఇంగ్లీష్ కంట్రీ ఛాంపియన్‌షిప్‌లో ససెక్స్ టీమ్‌కి ఆడి ఆ పిచ్‌లపై అద్భుత ప్రదర్శనను కనబరిచాడు. దీంతో ఈ ఇద్దరి వల్ల డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టుకి ప్రమాదం పొంచి ఉందని రిక్కీ పాంటింగ్ అన్నాడు. అందుకనే రాబోయే ఫైనల్స్‌లో ఈ ఇద్దరినీ కట్టడి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికల్ని ఆస్ట్రేలియా బౌలర్లు సిద్ధం చేసుకోవాలంటూ సూచించాడు.
"ఆస్ట్రేలియా టీమ్ విరాట్ కోహ్లీ గురించి చాలా మాట్లాడుకుంటుంది. అలానే ఛతేశ్వర్ పుజారా గురించి కూడా తప్పకుండా మా మధ్య చర్చ నడుస్తుంది. ఫైనల్లో ఈ ఇద్దరితోనే ఎక్కువ ప్రమాదం ఉంది. పుజారా గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా టీమ్‌పై నిలకడగా పరుగులు చేస్తున్నాడు. ఓవల్ పిచ్ కూడా ఆస్ట్రేలియా పిచ్‌లను పోలి ఉంటుంది. కాబట్టి.. అతడ్ని వేగంగా ఎలా ఔట్ చేయాలో ఆస్ట్రేలియా బౌలర్లకి తెలుసు. ఇక విరాట్ కోహ్లీ కూడా బెస్ట్ ఫామ్‌లో ఉన్నాడు. అతను కచ్చితంగా ఆసీస్ బౌలర్లకి సవాల్ విసరగలడు" అంటూ రిక్కీ పాంటింగ్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.
WTC Final 2023 : ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. జూన్ 7 -11 తేదీల్లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఇటీవలే ఐపీఎల్ ముగించుకున్న టీమ్ఇండియా ఆటగాళ్లంతా ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకుని.. ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. కాగా మొదటి డబ్ల్యూటీసీ 2019-21 ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమ్ఇండియా ఈసారి ఎలాగైన టైటిల్ గెలవాలన్న కసితో బరిలో దిగనుంది.
WTC Final 2023 Squad : రోహిత్ శర్మ(కెప్టెన్), ఛెతేశ్వర్ పుజారా, శుభ్‌మన్ గిల్, అజింక్య రహానె, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, సిరాజ్, షమి, జయదేవ్ ఉనద్కత్, ఉమేశ్ యాదవ్ .