Ashish Nehra on Kohli: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమ్ఇండియా మిడిలార్డర్ ప్రదర్శన పేలవంగా కొనసాగుతోంది. బ్యాటర్లు ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే మరోసారి విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో వారిని జట్టులో నుంచి తొలగించాలని అభిమానులు విమర్శిస్తున్నారు. సీనియర్ క్రికెటర్లు సైతం.. పుజారా, రహానే బ్యాటింగ్ ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా పలు వ్యాఖ్యలు చేశాడు.
"విరాట్ కోహ్లీ గణాంకాలేమీ పుజారా, రహానే కంటే భిన్నంగా లేవు. కానీ, కోహ్లీ స్థానంపై ఎవ్వరూ ప్రశ్నించడంలేదు. ఒకప్పుడు విరాట్ మెరుగైన ఫామ్‌ను కనబరిచాడు. ప్రస్తుతం పరుగులు చేయలేకపోతున్నాడు. విరాట్‌ను పుజారా, రహానేతో పోల్చడం సరికాదు. కానీ, ఒకప్పుడు రహానే, పుజారా కూడా ఉత్తమంగా బ్యాటింగ్ చేశారు కదా."
--ఆశిష్ నెహ్రా, టీమ్ఇండియా మాజీ బౌలర్.
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా రహానే, పుజారా ఫామ్‌పై విమర్శలు చేశాడు. జోహెన్నెస్‌బర్గ్ టెస్టు వారికి ఆఖరి మ్యాచ్ అవుతుందని అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో అశిష్ నెహ్రా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.