బ్యాడ్మింటన్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ గడువును వచ్చే ఏడాదికి పొడిగిస్తున్నట్లు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తెలిపింది. వాస్తవ క్వాలిఫికేషన్ కాలంలో ఉన్న పాయింట్లను కొనసాగిస్తామని చెప్పింది. బ్యాడ్మింటన్ అర్హత గడువు ఈ ఏడాది ఏప్రిల్ 28తో ముగిసింది. కానీ కరోనా కారణంగా చివరి ఆరు వారాల్లో జరగాల్సిన టోర్నీలను బీడబ్ల్యూఎఫ్ నిర్వహించలేకపోయింది.
బ్యాడ్మింటన్ ఒలింపిక్ అర్హత గడువు పొడిగింపు - BWF latest news
బ్యాడ్మింటన్ ఒలింపిక్ అర్హత గడువును వచ్చే ఏడాదికి పొడిగిస్తున్నట్లు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్లూఎఫ్) తాజాగా ప్రకటించింది. కరోనా కారణంగా జరగాల్సిన టోర్నీలను నిర్వహించలేని కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
బ్యాడ్మింటన్ ఒలింపిక్ అర్హత గడువు పొడిగింపు
"2021లో మొదటి వారం నుంచి 17వ వారం వరకు ఒలింపిక్ క్వాలిఫికేషన్ కాలం ఉంటుంది. మహమ్మారి కారణంగా వాయిదా పడ్డ, రద్దయిన టోర్నీల్లో కొన్నింటిని నిర్వహిస్తారు" అని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. ఇంతకుముందున్న పాయింట్లనే కొనసాగిస్తే సైనా, శ్రీకాంత్‌లకు ఒలింపిక్ అర్హత కష్టమవుతుంది.
ఇదీ చూడండి... ఆసీస్ పర్యటన యథాతథం.. అడిలైడ్లోనే గులాబీ టెస్టు