తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వరుణ్ 'కళంక్' ​లుక్ - sonakshi

పీరియడ్ డ్రామాగా తెరకెక్కుతోన్న సినిమా కళంక్​. ఈ చిత్రంలో బాలీవుడ్​ నటుడు వరుణ్​ ధావన్​ నటిస్తున్నాడు. ఈ మూవీ తొలిరూపు గురువారం విడుదల చేసింది చిత్రబృందం.

వరుణ్​ధావన్

By

Published : Mar 7, 2019, 2:29 PM IST

వరుణ్ ధావన్ కొత్తచిత్రం కళంక్ తొలిరూపు విడుదలైంది. పోస్టర్​లో వరుణ్ గడ్డంతో రఫ్​గా కనిపిస్తున్నాడు. మాధురి దీక్షిత్, సోనాక్షి సిన్హా ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్​లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాఫర్ అనే పాత్రను పోషిస్తున్నాడు వరుణ్. కరణ్​జోహార్, సాజిద్ నడియావాలా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిషేక్ వర్మన్ దర్శకత్వం వహిస్తున్నారు. 2 స్టేట్స్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు అభిషేక్ .అలియా భట్, ఆదిత్యరాయ్ కపూర్, సంజయ్​దత్ భారీ తారాగణం ఇందులో కనిపించనున్నారు.

గత ఏడాది సూయిధాగా, అక్టోబర్ చిత్రాలతో అలరించాడీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ హీరో. ప్రస్తుతం రెమోడిసౌజా తెరకెక్కిస్తున్న 'స్ట్రీట్ డ్యాన్సర్'లోనూ నటిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details