తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించా'

'అలీతో సరదాగా' టాక్​ షోకు హాజరైన నటీమణులు అన్నపూర్ణ-వై.విజయ.. తమ సినీ సంగతుల్ని పంచుకున్నారు. వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆసక్తికర విషయాలు చెప్పారు.

ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించా: నటి విజయ
senior actresses annapurna, y.vijaya in ali tho saradaga

By

Published : Dec 22, 2020, 1:55 PM IST

తాను ముగ్గురు ముఖ్యమంత్రులతోనూ నటించానని సీనియర్ నటి వై.విజయ చెప్పారు. 'అలీతో సరదాగా' కార్యక్రమానికి మరో నటి అన్నపూర్ణతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ తమ జీవితం, కెరీర్​కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.

తన అసలు పేరు ఉమ అని చెప్పిన అన్నపూర్ణ.. అనుకోకుండా అవకాశం రావడం వల్ల 'నీడలేని ఆడది' సినిమాలో నటించానని అన్నారు. ఆ తర్వాత దాదాపు 700కు పైగా చిత్రాలు చేశానని చెప్పారు. ఇండస్ట్రీ, అమ్మ.. ఈ రెండంటే తనకు ప్రాణమని తెలిపారు. అలానే తనకు సినిమాల్లో ఆరుగురు భర్తలు ఉండేవారని వెల్లడించారు(నవ్వుతూ).

తన గురించి చెప్పిన వై.విజయ.. మూడేళ్ల వయసు నుంచే డ్యాన్స్​ చేయడం మొదలుపెట్టానని అన్నారు. 13 ఏళ్లకే 'తల్లిదండ్రులు' సినిమాతో హీరోయిన్​గా మారానని చెప్పారు. అందులో శోభన్​బాబు, సావిత్రిలతో పాటు నటించానని అన్నారు. తనకు అప్పట్లో ఏం చేయాలో ఎలా చేయాలో తెలియకపోయినా సరే, డైరెక్టర్లు చెప్పినట్లే నటించేదానిని అని విజయ తెలిపారు. ముగ్గురు ముఖ్యమంత్రులతో(ఎమ్​జీఆర్, ఎన్టీఆర్, జయలలిత) కలిసి నటించానని అప్పటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు. ఓసారి తన డేట్లు సర్దుబాటు కాక ఆర్జీవీ ఓ సినిమా షెడ్యూల్​ను వాయిదా వేశారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details