నటుడు, బుల్లితెర వ్యాఖ్యాత సుధీర్.. రష్మిలా, నటుడు ఆది.. దీపికలా మారితే ఎలా ఉంటుంది? 'ఇదే అవకాశం అన్నట్టు తమ మనసులో ఏముందో బయట పెట్టేస్తారు. వినోదం పంచుతారు' అని అనుకుంటున్నారా! మీరనుకుంది నిజమే. 'ఢీ 13'(Dhee 13 Latest Promo) కార్యక్రమం వేదికగా వారు అదే చేశారు. ప్రదీప్ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రతి బుధవారం ప్రసారమవుతున్న షో ఇది. సెప్టెంబరు 8న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదలైంది.
సుధీర్, ఆది- రష్మి, దీపికలా మారితే..! - ఢీ 13 లేటెస్ట్ ప్రోమో
జబర్దస్త్ ఫేం సుధీర్, ఆది.. రష్మి, దీపికలా మారితే ఎలా ఉంటుంది? ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తారు. వినోదం పంచుతారు. 'ఢీ 13'(Dhee 13 Latest Promo) కార్యక్రమం వేదికగా వారు అదే చేశారు. ఈ ప్రోమోను మీరు చూసేయండి..
సుధీర్, రష్మి
వినాయకచవితిని పురస్కరించుకుని వినాయకుడి పాటలకి కంటెస్టెంట్‌లు చేసిన డ్యాన్సులు, కింగ్స్ టీమ్‌లీడర్లు సుధీర్, ఆది, క్వీన్స్ టీమ్‌లీడర్లు రష్మి, దీపిక అల్లరితో ఆద్యంతం అలరిస్తోంది. సుధీర్ - రష్మి(Sudheer Rashmi), ఆది- దీపిక వారు వీరుగా- వీరు వారుగా మారిపోయి సందడి చేశారు. ఒకరిపై మరొకరు పంచ్‌లు వేస్తూ కామెడీ పండించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ హంగామాని మీరూ చూసేయండి..
ఇదీ చదవండి:అవమానాలు భరించి.. కష్టాల కడలి దాటి.. సరికొత్త జీవితం దిశగా!