బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తోన్న కార్యక్రమం 'బిగ్‌బాస్'(Bigg Boss 5 Telugu). నాగార్జున వ్యాఖ్యాతగా 5వ సీజన్(Bigg Boss Telugu Latest News) ప్రసారమవుతోంది. హౌస్‌మేట్స్ అంతా తమదైన శైలిలో వినోదం పంచుతున్నారు. ఈ క్రమంలో వారు అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంటుంది. షణ్ముఖ్‌కి ఇదే పరిస్థితి ఎదురైంది.
ఈ రోజు ప్రసారంకానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో(Bigg Boss Telugu Latest Promo) ఈ విషయాన్ని తెలియజేసింది. ఏమైందంటే.. శ్వేత, షణ్ముఖ్ ఓ డీల్ (ఒప్పందం) గురించి మాట్లాడుకుంటారు. లోబోని పక్కకి తప్పించి వీరిద్దరే డబ్బులు తీసుకోవాలనుకుంటారు. అలా.. 'పెళ్లి చేసుకుందాం! శ్వేత' అంటూ శ్వేతకి షణ్ముఖ్ దగ్గరవుతాడు. కట్ చేస్తే 'ఐ లవ్ యు శ్వేత.. నువ్వంటే నాకు పిచ్చి. నువ్వంటే నాకు ఊపిరి' అని లోబో చెప్పగానే శ్వేత నవ్వుతూ థ్యాంక్స్ అంటుంది. ఈ సీన్ చూసిన షణ్ముఖ్‌కి కోపం వస్తుంది. 'ఏమైనా అందామంటే ముఖం మీద పెయింట్ వేసి కొడుతుంది' అంటూ తన ఫ్రస్టేషన్ చూపిస్తాడు. ఈ మాటకి శ్వేత ఫీలవుతుంది. 'నోటి దురద' అనుకుంటూ శ్వేతని క్షమించమని షణ్ముఖ్ బతిమలాడాడు. మరి శ్వేత అతణ్ని క్షమించిందా, లేదా? తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.