బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌ను అభిమానించే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అందులోనూ మహిళా ఫ్యాన్స్ గురించి చెప్పనక్కర్లేదు. చాలా మంది అమ్మాయిల నుంచి పెళ్లి ప్రపోజల్స్ కూడా వచ్చాయి ఈ హీరోకు. అయితే హృతిక్‌తో పిల్లలను కనాలని ఉందంటూ ఓ యువతి ట్వీట్ చేసింది. ఈ గ్రీక్ గాడ్ వీర్యం కావాలంటూ పోస్ట్ చేసింది.
తమిళనాడుకు చెందిన మహిళా క్రికెటర్ భావన... హృతిక్ నటించిన వార్ సినిమా చూసి అతడిపై తెగ ప్రేమ పెంచేసుకుంది. తనకు వీపరీతంగా నచ్చేశాడని, ఏకంగా హృతిక్ స్పెర్మ్ కావాలని బహిరంగంగా చెప్పేసింది.