తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వి' సినిమాలో విలన్‌గా ముద్దుగుమ్మ అదితీ! - అదితీ రావు

నేచురల్ స్టార్ నాని 'వి' సినిమాకు సంబంధించిన ఓ వార్త ఆసక్తి కలిగిస్తోంది. ఇందులో ఇతడితో పాటే హీరోయిన్ అదితీ రావు హైదరీ ప్రతినాయక లక్షణాలున్న పాత్రలోనే కనిపించనుందని టాక్.

Will Aditi also apper as a Villain in V?
అదితి కూడా ‘వి’లన్‌గా కనిపించనుందా?

By

Published : Apr 8, 2020, 7:47 AM IST

ప్రముఖ నటులు నాని, సుధీర్‌ బాబుల మల్టీస్టారర్ సినిమా 'వి'. గత నెలలో ఉగాదికి విడుదల కావాల్సినా, కరోనా వల్ల వాయిదా పడింది. ఈ వైరస్​ ప్రభావం తగ్గిన తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఆసక్తి కలిగిస్తోంది. నేచురల్ స్టార్ నానితో పాటే హీరోయిన్ అదితీ.. ప్రతినాయక లక్షణాలున్న పాత్రలో కనిపించనుందని సమాచారం.

ఆ పాత్రలకే అధిక ప్రాధాన్యం

'వి'లో నెగిటివ్​ పాత్రలకే ప్రాధాన్యం ఉందని, అందుకే నాని సరసన నటించే భామకు విలనిజం పోషించే అవకాశం వచ్చిందని టాక్‌. మరి ఈ పాత్రలో అదితీ ఎలా మెప్పిస్తుందో చూడాలి. ఇందులో నివేదా థామస్ మరో కథనాయికగా నటించింది. అమిత్‌ త్రివేది సంగీతమందించాడు. మోహన్​కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించాడు. దిల్‌ రాజు నిర్మాత.

ఇదీ చదవండి:విరాళాల కోసం వర్చువల్​ డేటింగ్​కు సిద్ధమైన హీరో

ABOUT THE AUTHOR

...view details