తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మరోసారి మంచి మనసు చాటుకున్న బాలయ్య

నందమూరి హీరో బాలకృష్ణ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. కరోనా నేపథ్యంలో సినీ పరిశ్రమలోని 24 విభాగాల వారికి హోమియో మాత్రలు, విటమిన్ ట్యాబ్లెట్లను పంపిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు వి.వి వినాయక్ తెలిపారు.

మరోసారి మంచి మనసు చాటుకున్న బాలయ్య
మరోసారి మంచి మనసు చాటుకున్న బాలయ్య

By

Published : Jul 26, 2020, 5:31 AM IST

అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి వేదికగా ఎంతోమంది పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న ఆయన.. కరోనా నుంచి రక్షణ పొందేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన 24 విభాగాల వారికి మందులు పంపారు. ఈ విషయాన్ని దర్శకుడు వి.వి.వినాయక్‌ అభిమానులతో పంచుకున్నారు.

"ప్రస్తుతం అన్ని చోట్లా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బసవతారకం ఆస్పత్రి ద్వారా హోమియో మాత్రలు, విటమిన్‌ ట్యాబ్లెట్లను బాలకృష్ణ నాకు పంపారు. కేవలం నా ఒక్కడికి మాత్రమే కాదు. సినీ పరిశ్రమకు చెందిన 24 విభాగాల వారికి పంపిస్తున్నారు. నన్ను గుర్తుపెట్టుకుని మరీ మందులు పంపిన బాలకృష్ణకు ధన్యవాదాలు."

-వి.వి.వినాయక్‌, దర్శకుడు

ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఇటీవల బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన 'బీబీ3 ఫస్ట్‌ రోర్‌'కు విశేష స్పందన వచ్చింది. కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణ తాత్కాలికంగా వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడగానే సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. బాలకృష్ణ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒకటి అఘోర పాత్ర కావడం విశేషం.

ABOUT THE AUTHOR

...view details