తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బ్రేక్అప్ అంటున్న విజయ్ దేవరకొండ..?

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రానికి 'బ్రేక్​అప్' అనే టైటిల్ పెట్టనున్నారని సమాచారం.

విజయ్

By

Published : May 23, 2019, 11:16 AM IST

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. కథానాయికలుగా ఐశ్వర్య రాజేష్, రాశీఖన్నా, ఇస్బె​ల్లా నటిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్‌ లవ్ ఫెయిల్యూర్ అయిన యువకుడి పాత్రలో నటిస్తున్నాడని సమాచారం.

సింగరేణి కాలరీస్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న కథలో ముగ్గురమ్మాయిల ప్రేమికుడిగా విజయ్‌ కనిపించనున్నాడని సమాచారం. ఇందులో ఏ అమ్మాయికి బ్రేక్‌అప్‌ చెప్పాడనేది సస్పెన్స్‌. కథలో భాగంగా చిత్రానికి 'బ్రేక్‌అప్‌' అనే టైటిల్‌ అయితే బాగుంటుందని చిత్ర వర్గాలు అనుకుంటున్నాయట. అధికారికంగా ఈ పేరును ప్రకటించాల్సి ఉంది. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది.

ఇవీ చూడండి.. సెలీనా కొత్తప్రియుడు 68 ఏళ్ల ముర్రే..!

ABOUT THE AUTHOR

...view details