తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జోరుగా, హుషారుగా 'ఫైటర్​' చిత్రీకరణ - fighter movie

దర్శకుడు పూరిజగన్నాథ్​ సినిమాలంటే హీరోయిజం, రొమాన్స్​, యాక్షన్​ సన్నివేశాలు కచ్చితంగా ఉంటాయి. ఎన్ని రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసినా అతడి మార్క్​ చేరుకోవటంలో విజయం సాధిస్తాడు. ఇప్పుడదే స్పీడ్​తో 'ఫైటర్​' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్​డేట్​ను ప్రకటించింది చిత్రబృందం.

Vijay Devarakomda - Puri Jagannadh New Movie Update
స్పీడ్​గా.. యమజోరుగా 'ఫైటర్​' చిత్రీకరణ

By

Published : Mar 8, 2020, 5:43 PM IST

ఒకసారి షూటింగ్​ ప్రారంభించిన చిత్రాన్ని అత్యంత వేగంగా పూర్తి చేయగల దర్శకుల్లో అందరి కన్నా ముందు వరుసలో ఉంటాడు పూరి జగన్నాథ్‌. అతడు ఎంత పెద్ద స్టార్‌ కథానాయకుడితో చేసినా దాదాపు మూడు నెలల్లోనే చిత్రీకరణను ముగించేస్తుంటాడు. ఇప్పుడు పూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఫైటర్‌' (వర్కింగ్‌ టైటిల్‌)ను కూడా ఇంతే వేగంగా పూర్తి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.

విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తోన్న చిత్రాన్ని.. పూరి కనెక్ట్స్, కరణ్‌ జోహార్‌ ధర్మ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ముంబయిలో రెగ్యులర్‌ షూట్‌ జరుపుకొంటోన్న ఈ చిత్రం.. ఇప్పటికే 40 రోజుల చిత్రీకరణ పూర్తిచేసుకుంది. తాజాగా దీనికి సంబంధించి చిత్రబృందం ట్విట్టర్‌ వేదికగా ఓ ఫొటోను షేర్‌ చేసింది. ఇప్పటి వరకు ముంబయిలో 40 రోజుల చిత్రీకరణ ముగిసిందని, ఈ షెడ్యూల్స్‌లో చిత్ర ప్రధాన తారాగణం విజయ్​ దేవరకొండ, అనన్య, రమ్యకృష్ణ, అలీలపై కీలక ఎపిసోడ్లను చిత్రీకరించినట్లు తెలిపింది.

'ఫైటర్​' చిత్రీకరణలో విజయ్​ దేవరకొండ, పూరి జగన్నాథ్, ఛార్మి

ఇదీ చూడండి.. రౌడీతో రొమాన్స్​కు అనన్య పాండే రెడీ

ABOUT THE AUTHOR

...view details