తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విజయ్​-మురుగదాస్​ కాంబినేషన్​లో మరో చిత్రం..? - AR Muruga Doss

కోలీవుడ్​లో బ్లాక్​బాస్టర్ కాంబినేషన్​ ఇళయ దళపతి విజయ్​- దర్శకుడు మురుగదాస్​కు ప్రేక్షకుల్లో విశేషాదరణ ఉంది. తాజాగా వీరిద్దరి కలయికలో మరో కొత్త సినిమా పట్టాలెక్కనుందని చిత్రసీమలో జోరుగా ప్రచారం జరుగుతోంది.​

Vijay and Muruga doss Movie Repeat
విజయ్ - మురుగదాస్​

By

Published : Dec 24, 2019, 11:59 PM IST

ఇళయ దళపతి విజయ్‌, దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌కు ప్రేక్షకులల్లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. ‘తుపాకి’, ‘కత్తి’, ‘సర్కార్’ చిత్రాలే దానికి నిదర్శనం. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్​లో మరో చిత్రం తెరకెక్కనుందనే వార్త కోలీవుడ్‌లో వినిపిస్తోంది.

విజయ్‌ కోసం మురుగదాస్‌ కథను సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలో ఈ చిత్రం రూపొందనుందని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం మురుగదాస్‌.. రజనీ కథానాయకుడుగా ‘దర్బార్‌’ చిత్రం దాదాపుగా పూర్తయింది. ఆ చిత్రం విడుదలయ్యాక విజయ్‌తో చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇదీ చదవండి: మహాభారతంలో కృష్ణుడు-ద్రౌపదిగా నటించేది వీళ్లేనా?

ABOUT THE AUTHOR

...view details