బాలీవుడ్లో ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా విడుదలయ్యేందుకు మరో సినిమా సిద్ధమైంది. గణిత శాస్త్రవేత్త 'శకుంతలా దేవి' బయోపిక్ ఈ జాబితాలో చేరింది. అమెజాన్ ప్రైమ్‌లో జులై 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను చిత్రబృందం పోస్ట్ చేసింది.
ఇందులో టైటిల్ రోల్ పోషించిన విద్యాబాలన్ ఓ క్లిష్టమైన లెక్కను పరిష్కరించమని అభిమానులకు పజిల్ ఇచ్చి... మళ్లీ తానే సమాధానం చెబుతూ కనిపించింది. ఆ సమాధానమే సినిమా విడుదల తేదీ.