కన్నడ దిగ్గజ నటుడు, నిర్మాత, దర్శకుడు ఎస్.శివరామ్(83) తుదిశ్వాస విడిచారు. తలకు గాయం కావడం వల్ల గురువారం, బెంగళూరులోని ఆస్పత్రిలో చేరిన ఆయన.. శనివారం మరణించారు.
ఇంట్లో పూజా చేస్తుండగా శివరామ్ కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో తలకు గాయమైంది. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా, బ్రెయిన్లో బ్లీడింగ్ అయినట్లు తేలింది. ఆయన వయసు కారణంగా వైద్యులు సర్జరీ చేయడం కుదరలేదు. గత రెండు రోజులుగా ఆయనకు చికిత్స అందిస్తున్నప్పటికీ, శివరామ్‌ను డాక్టర్లు బతికించలేకపోయారు.
దాదాపు ఆరు దశాబ్దాల పాటు కన్నడ సినిమాల్లో ఆయన పనిచేశారు. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్య పాత్రలు, సహాయపాత్రలు పోషించారు. 1965 సినిమాలో 'బేరత జీవా' సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. 90కి పైగా సినిమాల్లో నటించారు.