తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వెంకీకి గాయం.. రెండు వారాలు విశ్రాంతి

'వెంకీమామ' షూటింగ్​లో విక్టరీ వెంకటేశ్​ గాయపడ్డాడు. కాలు స్వల్పంగా బెణికినందుకు రెండు వారాలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు.

బాబీ

By

Published : Aug 18, 2019, 12:50 PM IST

Updated : Sep 27, 2019, 9:32 AM IST

విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం 'వెంకీమామ'. పాయల్ రాజ్​పుత్, రాశీఖన్నా హీరోయిన్లు. అయితే రామోజీ ఫిల్మ్​సిటీలో జరుగుతున్న షూటింగ్​లో వెంకటేశ్​ గాయపడ్డాడు. కాలు స్వల్పంగా బెణికినందున చిత్రీకరణను ఆపేశారు. వెంకటేశ్​కు రెండు వారాలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు.

ఇప్పటికే 'ప్రేమమ్'లో కొద్దిసేపు కలిసి నటించిన వెంకటేశ్, నాగచైతన్య.. పూర్తి స్థాయిలో నటిస్తున్నందున ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకటేశ్ సరసన పాయల్, చైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు.

దర్శకుడు బాబీ పుట్టినరోజు కానుకగా వచ్చిన మేకింగ్ వీడియోకు మంచి స్పందన లభించింది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు.

ఇవీ చూడండి.. 'ఫిట్​నెస్​ విషయంలో వారే నాకు స్ఫూర్తి'

Last Updated : Sep 27, 2019, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details