తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దాని గురించి నేను ఆలోచించను: విక్టరీ వెంకటేశ్ - దృశ్యం 2 తెలుగు ఓటీటీ

'దృశ్యం 2'తో(drishyam 2 telugu release date) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న విక్టరీ వెంకటేశ్(venkatesh movies).. సినిమా సంగతులతో పాటు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తర్వాతి ప్రాజెక్టుల గురించి కూడా చెప్పారు.

venkatesh drishyam 2
వెంకటేశ్

By

Published : Nov 19, 2021, 6:45 AM IST

రీమేక్‌ సినిమాల్లో నటించడం కష్టం అంటుంటారు కొద్దిమంది తారలు. మాతృకలోని తారల నటనతో పోల్చి చూస్తుంటారు. ఏమాత్రం తేడా వచ్చినా విమర్శలు తప్పవు. వెంకటేశ్(venkatesh movies) ఆ సవాల్‌ను అవలీలగా స్వీకరిస్తుంటారు. ఆయన సినీ జీవితంలో రీమేక్‌లు చాలానే. 'నారప్ప'(narappa movie) తర్వాత మరోసారి 'దృశ్యం2' చేశారు. మలయాళంలో విజయవంతమైన 'దృశ్యం2'కి(drishyam 2 telugu ott release date) రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ నెల 25న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా వెంకటేశ్.. గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ..

ఆరేళ్ల తర్వాత రాంబాబు పాత్రలోకి మరోసారి పరకాయ ప్రవేశం చేయడం ఎలాంటి అనుభవాన్నిచ్చింది?

ఆ పాత్రలో ఓ అందం ఉంది. రాంబాబు సమస్య అందరికీ తెలిసిందే కదా. చేస్తుంది తప్పా ఒప్పా అనేది పక్కనపెడితే ఏం జరిగినా తన కుటుంబం కోసం అండగా నిలవాలనుకునే వ్యక్తి. అందరికీ ఆలోచనలు వస్తాయి కానీ, రాంబాబు మాస్టర్‌ ప్లాన్స్‌ వేరే స్థాయిలో ఉంటాయి. వాటిని తెరపై చూడాల్సిందే. ఆరేళ్ల తర్వాత మళ్లీ కొత్తగా పరిశోధన మొదలవుతుంది. తన కుటుంబం మరోసారి సమస్యల్లోకి వెళుతుంది. ఈసారి తన కుటుంబం కోసం రాంబాబు ఏం చేశాడు? ఎలా ఆలోచించాడన్నది ప్రత్యేకం.

దృశ్యం 2 మూవీలో సీన్

'దృశ్యం2'లో ఉన్న ప్రత్యేకతలేంటి?

'దృశ్యం' చూశాక ఇలాంటి కథల్లో నటించాలని చాలా మంది అనుకున్నారు. దానికంటే ఇంకా థ్రిల్లింగ్‌గా, మరిన్ని కుటుంబ భావోద్వేగాలతో కూడుకుని ఉంటుందీ చిత్రం. సీక్వెల్‌ అనగానే ఎలా ఉంటుందో అనే ఓ భయం ఉండేది. ఆరేళ్ల తర్వాత జీతూ జోసెఫ్‌ మరో అద్భుతమైన స్క్రిప్ట్‌తో ఈ సినిమా చేశాడు. మొదటి భాగం చూడకపోయినా 'దృశ్యం2'(drishyam 2 trailer) అర్థమవుతుంది. ఒక వేళ చూడాలనుకున్నా అది ఓటీటీల్లో అందుబాటులోనే ఉంటుంది కదా!

ఈ సినిమా ఓటీటీలో రావడమే సరైందని భావిస్తున్నారా?

సినిమా చేయడం వరకే నా బాధ్యత. విడుదల విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోను. ఇది తప్పు, అది ఒప్పు అనేమీ ఉండదు. పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇంకా థియేటర్‌కు రాని కుటుంబ ప్రేక్షకులు దీన్ని ఓటీటీ వేదికల ద్వారా చూడొచ్చనుకున్నాం. థియేటర్లలో విడుదల కాలేదని నా అభిమానులు బాధ పడుతుండొచ్చు కానీ.. భవిష్యత్తులో నా సినిమాలు థియేటర్లలోనే విడుదలవుతాయి.

దృశ్యం 2 మూవీ

'దృశ్యం3'(drishyam 3 story) గురించి ప్రణాళికలేమైనా ఉన్నాయా?

అది ఉంటుందో లేదో తెలియదు కానీ.. ఈసారి కథ రాయడానికి ఎక్కువ సమయమే పడుతుందని చెప్పారు దర్శకుడు జీతూ జోసెఫ్‌. మూడు నాలుగేళ్లైనా పట్టొచ్చేమో. 'దృశ్యం2'లో గడ్డంతో కనిపించాను, ఈసారి తెల్లగడ్డంతో కనిపిస్తానేమో మరి!

కొత్త దర్శకులతో సినిమాల వివరాలేమైనా చెబుతారా?

వాళ్లు సిద్ధం చేయాలి, వినిపించాలి.. ఇలా చాలా సమయం ఉంది. ప్రస్తుతానికైతే ఇంకా ఓకే చెప్పలేదు. కథలు వచ్చినప్పుడు చేద్దాం, లేనప్పుడు ఖాళీగా ఉందాం. ప్రపంచం తిరుగుదాం, ధ్యానం చేద్దాం. అందరూ బాగుండాలని కోరుకుందాం. దానికంటే ఏం ఉంటుంది?

'ఎఫ్‌3'లో(f3 release date) తొలి సినిమాలోలాగే ఫ్రస్ట్రేషన్‌ ఉంటుందా?

ఇప్పుడంతా ఫ్రస్ట్రేషనే కదా, తప్పదు. కాకపోతే ఇందులో డబ్బుకోసం ఫ్రస్ట్రేషన్‌. ప్రతి ఒక్కరికీ అదే అవసరం కదా. అందుకే అందరికీ కనెక్ట్‌ అవుతుంది. ఆసనాలు, హావభావాలు అవన్నీ మీరు తెరపై చూడాల్సిందే. దాదాపు చిత్రీకరణ పూర్తయింది. ఫిబ్రవరి చివర్లోనో విడుదల చేస్తాం.

వెంకటేశ్ వరుణ్​తేజ్ 'ఎఫ్ 3'

రానాతో కలిసి 'రానా నాయుడు'(rana naidu netflix) చేస్తున్నారు కదా? అది ఎంతవరకు వచ్చింది?

నెట్‌ఫ్లిక్స్‌ కోసం చేస్తున్న సినిమా అది. అందులో చాలా భిన్నమైన లుక్‌లో కనిపిస్తా. చిత్రీకరణ మొదలైంది. ఆ సినిమా పనుల్లోనే ఉన్నానిప్పుడు.

రీమేక్‌ సినిమాలే ఎక్కువగా చేస్తున్నారు. మీ ఇమేజ్‌కు తగిన కథలు రావడం లేదా?

ఇలాంటి కథలు ఎవ్వరి దగ్గరికీ ఎందుకు వెళ్లలేదు? 'నారప్ప'ని తెలుగులో మరెవ్వరూ చేయలేదు కదా? నేనే చేశానంటే కారణం ఏమిటి?జీవితంలో ఎవ్వరూ ఏ విషయం గురించి మరీ లోతుగా వెళ్లకూడదు. ఇమేజ్‌ అని మీరంటున్నారు. నేనెప్పుడూ ఇమేజ్‌ గురించి ఆలోచించను. నా దగ్గరికి అదెందుకు రాలేదు, ఇదెందుకు రాలేదని అటూ ఇటూ ఎప్పుడూ చూడను. నా దగ్గరికి వచ్చింది తీసుకోవడమే నాకు తెలుసు. అదృష్టంకొద్దీ ఈ రంగంలోకి వచ్చాను. ప్రేక్షకుల అభిమానం దొరికింది. ఎప్పటికప్పుడు కొత్త కథలు చేసేందుకు ప్రయత్నిస్తున్నా.

ABOUT THE AUTHOR

...view details