తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వరుణ్ తేజ్ 'గని' సన్నద్ధం.. జాలీరెడ్డి 'బడవ రాస్కెల్' - బడవ రాస్కెల్ తెలుగు మూవీ

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. వరుణ్​తేజ్ 'గని', 'పుష్ప'లో జాలీరెడ్డి నటించిన కన్నడ చిత్రం తెలుగు వెర్షన్​ రిలీజ్​కు సంబంధించిన సంగతులు ఉన్నాయి.

movie news
వరుణ్ తేజ్ బడవ రాస్కెల్ తెలుగు

By

Published : Jan 30, 2022, 6:37 AM IST

Ghani release date: ఆరు పలకల దేహం కోసం శ్రమించారు. విదేశాలకు వెళ్లి బాక్సింగ్‌లో తర్ఫీదు పొందారు. ఇదివరకటి కంటే భిన్నంగా సరికొత్త మేకోవర్‌తో సిద్ధమయ్యారు.. - ఇలా 'గని' కోసం యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌ కొత్త ప్రయత్నాలు చాలానే చేశారు. ఆయన బాక్సర్‌గా నటించిన చిత్రమే 'గని'. సయీ మంజ్రేకర్‌ కథానాయిక. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పకులు.

ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 18న కానీ, 24న కానీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొదట మార్చిలో చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. దీనికన్నా ముందే 'గని' ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమని తెలుస్తోంది. హీరో వరుణ్​తేజ్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తి చేశారు.

ప్రేమికుల రోజుని పురస్కరించుకుని ట్రైలర్‌ని విడుదల చేయనున్నట్టు తెలిసింది. ప్రొడక్షన్‌ డిజైనర్‌ రవీందర్‌ నేతృత్వంలో ప్రత్యేకంగా సెట్స్‌ని తీర్చిదిద్ది, చిత్రీకరణ చేశారు. జగపతిబాబు, సునీల్‌ శెట్టి, ఉపేంద్ర, నవీన్‌చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందించారు.

'బడవ రాస్కెల్' హంగామా

Badava rascal movie: 'పుష్ప'లో జాలీరెడ్డిగా సందడి చేశారు ధనుంజయ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన కన్నడ చిత్రం 'బడవ రాస్కెల్‌'. అమృత అయ్యంగార్‌ కథానాయిక. శంకర్‌ గురు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తోంది రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

"కన్నడలో ఘన విజయం సాధించిన చిత్రమిది. ధనుంజయ్‌ మాస్‌ పాత్రలో ఆకట్టుకున్నారు. ఆయన హంగామా తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుంది. త్వరలోనే విడుదల తేదీని వెల్లడిస్తాం" అని సినీ వర్గాలు తెలిపాయి.

బడవ రాస్కెల్ మూవీ

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details