బాలీవుడ్లో కరణ్‌జోహార్ నిర్మిస్తున్న 'కళంక్' చిత్రంపై తప్పుడు వార్తలను ఖండించాడు హీరో వరుణ్ ధావన్. ఈ సినిమా ప్రముఖ రచయిత శౌనా సింగ్ బల్విన్ రాసిన 'వాట్ ది బాడీ రిమైన్స్' పుస్తకం ఆధారంగా తెరకెక్కిందని పుకార్లు వస్తున్నాయి... వీటిలో వాస్తవం లేదని వరుణ్ ధావన్ తెలిపాడు.
"నేను ఆ పుస్తకం చదవలేదు. పుస్తకంలోని అంశాలు 'కళంక్' లో కలిశాయని అనుకోవడం లేదు. అది కూడా ప్రేమ కథే కావచ్చు.. సినిమా అంతకంటే విభిన్నంగా ఉంటుంది. ప్రేక్షకులు ఒక్కసారి సినిమా చూస్తే వారికే అర్థమవుతుంది. కరణ్ దగ్గర చాలా రోజుల నుంచి ఈ కథ ఉంది. నాతో సినిమా తీయాలని అనుకున్నాడు." - వరుణ్ ధావన్, బాలీవుడ్ నటుడు