'శుద్ద్ దేశీ రొమాన్స్'(2013)తో వెండితెరపై అడుగుపెట్టిన వాణీ కపూర్.. బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది. తెలుగులో నాని సరసన 'ఆహా కళ్యాణం'లో మెప్పించింది. ఈ ఆరేళ్ల కాలంలో సినీ రంగం తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని చెప్పుకొచ్చిందీ భామ.
"ఇండస్ట్రీలోకి వచ్చాక సరైన వైఖరితో పనిచేయడం నేర్చుకున్నా. ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్లిపోకూడదు అనే నిర్ణయంతో ఇక్కడికి వచ్చా. మంచి సినిమాల్లో నటించడానికి ఎప్పుడా సిద్ధమే. అయితే అనుకున్న సమయంలో పని పూర్తికాకపోతే, ఓపికతో పనిచేస్తూ నిద్రలేని రాత్రులు గడపాలి. కోపంతో ఇతరులను నిందించే వారికంటే, సంతోషంగా సానుకూల దృక్పథంతో ఉండే వారితో పనిచేయడమే నాకిష్టం. కథలపై ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. నేను పనిచేయాలనుకునే చిత్రనిర్మాతలపై నాకో అవగాహన ఉంది." -వాణీ కపూర్, నటి