మెగాహీరో వైష్ణవ్‌తేజ్ హీరోగా పరిచయమైన తొలి సినిమా 'ఉప్పెన' ప్రేక్షకులను అలరించి విశేషాదరణ సొంతం చేసుకుంది. వసూళ్లలో రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది.
కలెక్షన్లలో సెంచరీ కొట్టిన 'ఉప్పెన' సినిమా - uppena collections
విడుదలైన 23 రోజుల్లో 'ఉప్పెన', రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకున్నామని చిత్రనిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలోనే కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు.
కలెక్షన్లలో సెంచరీ కొట్టిన 'ఉప్పెన' సినిమా
ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాతోనే కృతిశెట్టి హీరోయిన్గా అరంగేట్రం చేసింది. విజయ్ సేతుపతి పోషించిన ప్రతినాయక లక్షణాలున్న పాత్ర ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. తొలి చిత్రంతోనే దర్శకుడు బుచ్చిబాబు సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
ఇవీ చదవండి: