బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి ఆలియా భట్ ఎవరో తెలియదని చెప్పాడు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షలే గిబ్స్. అయితే ఆమె నవ్వుతూ ప్రేమగా పలకరిస్తున్న 'జిఫ్ చిత్రం' మాత్రం చాలా బాగుందని ప్రశంసించాడు.
ఆదివారం ఉదయాన్నే తన ట్విట్టర్లో...." ఉదయాన్నే.. పక్షులు కిలకిలమంటూ పలకరిస్తున్నాయి. నేను కూడా అదే చేస్తాను" అని ట్వీట్ చేశాడు గిబ్స్. ఈ సందేశానికి అధికారిక ట్విట్టర్ విభాగం లైక్ కొట్టింది. ఈ సంఘటనపై సంతోషాన్ని వ్యక్తం చేసిన గిబ్స్... " ట్విట్టర్ నీ ట్వీట్‌ను లైక్ చేసినప్పుడు కలిగే ఫీలింగ్" అని ఆలియా భట్ నవ్వుతున్న జిఫ్ ఎమోజీని పోస్టు చేశాడు. దీనిని చాలా మంది రీట్వీట్ చేశారు.
ఒక నెటిజన్ మాత్రం 'ఆమె ఎవరో తెలుసా?' అని ప్రశ్నించాడు. దానికి బదులిచ్చిన గిబ్స్..."ఆమె ఎవరో తెలియదు. కానీ జిఫ్ బాగుంది" అని బదులిచ్చాడు.