తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అందుకే కుటుంబ కథలు చేస్తున్నా: త్రివిక్రమ్

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాటల మాంత్రికుడు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

trivikram
త్రివిక్రమ్

By

Published : Jan 10, 2020, 6:12 PM IST

'బాహుబలి', 'కేజీఎఫ్‌' చిత్రాల స్ఫూర్తితో ప్రస్తుతం భారతీయ చలన చిత్రసీమలో పాన్‌ ఇండియా చిత్రాలు వెల్లువలా బయటకొస్తున్నాయి. ఉత్తరాది దర్శకులే కాదు.. దక్షిణాది చిత్రసీమల స్టార్‌ డైరెక్టర్లూ పాన్‌ ఇండియా కథలను సిద్ధం చేసుకునే పనిలో పడిపోయారు. ప్రస్తుతం రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో మరోసారి అలాంటి కథను వడ్డించేందుకు ముస్తాబవుతుండగా.. పూరి జగన్నాథ్‌ 'ఫైటర్‌'తో ఇదే తరహా ప్రయత్నం చేయబోతున్నాడు. ఇప్పుడీ జాబితాలోకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కూడా చేరబోతున్నాడా? ఈ ప్రశ్నకు తాజాగా త్రివిక్రముడే జవాబిచ్చాడు.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా 'అల వైకుంఠపురములో' చిత్రం తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియాతో ముచ్చటిస్తూ తన సినీ కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడీ మాటల మాంత్రికుడు.

త్రివిక్రమ్

"ప్రస్తుతానికి నా దగ్గర పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కించే కథలైతే ఏవీ లేవు. కానీ, అలాంటి కథ దొరికినప్పుడు కచ్చితంగా హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లోనూ ఆ చిత్రాన్ని పాన్‌ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తా" అని క్లారిటీ ఇచ్చాడు త్రివిక్రమ్.

తాను ఎక్కువగా కుటుంబ సమస్యలనే కథాంశాలుగా మలచుకోవడానికి గల కారణాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించాడు. "ప్రతి ఒక్కరూ నన్ను కుటుంబాల్లోని చిన్న సమస్యలనే కథా వస్తువులుగా తీసుకుంటారు. ఓ సామాజిక సమస్యపై ఎందుకు సినిమా తియ్యరు అని అడుగుతుంటారు. నిజానికి ప్రతి కుటుంబంలో ఉండే సమస్యలు సామాజిక సమస్యలకు ఏ మాత్రం తక్కువ కాదు. ఇంటికి వెళ్లగానే పలకరించే కుటుంబ సభ్యులు. వారితో గడిపే క్షణాలు మంచి అనుభూతినిస్తాయి. అందుకే నేను ఎక్కువగా ఆ తరహా చిత్రాలు చేయడానికే ఇష్టపడుతుంటా" అని చెప్పుకొచ్చాడు.

ఇవీ చూడండి.. నవ్వించేందుకు సిద్ధమైన నితిన్ 'భీష్మ'

ABOUT THE AUTHOR

...view details