తెలంగాణ

telangana

By

Published : Mar 12, 2020, 7:59 AM IST

ETV Bharat / sitara

ఆస్కార్​ అవార్డు గ్రహీతతో పాటు అతడి భార్యకు కరోనా

తనతో పాటు తన భార్యకు కరోనా సోకినట్లు ట్విట్టర్​లో ప్రకటించాడు హాలీవుడ్​ నటుడు టామ్ హ్యాంక్స్.

ఆస్కార్​ అవార్డు గ్రహీతకు కరోనా.. ట్విట్టర్​లో ప్రకటన
భార్య రీటాతో టామ్ హ్యాంక్స్

ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ హాలీవుడ్​ నటుడు టామ్​ హ్యాంక్స్​కు కరోనా వైరస్​ సోకింది. తనతో పాటు భార్యకు పాజిటివ్​గా తేలిందని చెప్పాడు. ట్విట్టర్​ వేదికగా ఓ ప్రకటనను విడుదల చేశాడు. ఇలా తనకు వైరస్​ సోకినట్లు బహిరంగంగా చెప్పిన మొదటి హాలీవుడ్​ నటుడు ఇతడే.

టామ్ హ్యాంక్స్​ ట్విట్టర్​ ప్రకటన

63 ఏళ్ల హ్యాంక్స్​.. ప్రస్తుతం ఎల్విస్ ప్రెస్లీ జీవితం ఆధారంగా తీస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుగుతుండగా, అతడికి జ్వరం వచ్చినట్లు అనిపించడం వల్ల వైద్య పరీక్షలు చేశారు. అందులో కరోనా వచ్చినట్లు తేలింది. ప్రస్తుతం వీరిద్దరూ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.

ఇది చదవండి:'హ్యారీ పోటర్​' హీరో డేనియల్​కు కరోనా?

ABOUT THE AUTHOR

...view details