తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్​ ఈశ్వర్​ కన్నుమూత - పబ్లిసిటీ డిజైనర్​ ఈశ్వర్​

టాలీవుడ్​ ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్​ కన్నుమూశారు. మంగళవారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

Tollywood Famous Publicity Designer Eswar Passed Away
టాలీవుడ్​ ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్​ ఈశ్వర్​ కన్నుమూత

By

Published : Sep 21, 2021, 8:43 AM IST

Updated : Sep 21, 2021, 8:51 AM IST

ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌ కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో మంగళవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. పబ్లిసిటీ డిజైనర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆయన పలు చిత్రాలకు పోస్టర్లు తయారు చేసి.. అందరి మన్ననలు అందుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన ఈశ్వర్‌కు చిన్నతనం నుంచి బొమ్మలు గీయడమంటే ఎంతో ఆసక్తి. ఈ క్రమంలోనే వంశపారంపర్యంగా వస్తున్న బొమ్మలు గీసే వృత్తిలోకి అడుగుపెట్టారు. స్వాతంత్ర్య వేడుకల్లో గాంధీ బొమ్మ వేసి చిన్నతనంలోనే అందరి మన్ననలు పొందారు‌. బొమ్మలు గీయాలనే ఆసక్తితో కాకినాడ పాలిటెక్నిక్‌ కళాశాలలో చదువును మధ్యలోనే ఆపేసి.. స్నేహితుడి సాయంతో మద్రాస్‌కు వెళ్లి పబ్లిసిటీ ఆర్టిస్టుగా స్థిరపడాలని నిర్ణయించుకున్నారు.

ఆర్టిస్ట్‌ కేతా వద్ద పోస్టర్‌ డిజైనింగ్‌లో మెళకువలు నేర్చుకుని 'ఈశ్వర్‌' పేరుతో సొంత పబ్లిసిటీ కంపెనీకి శ్రీకారం చుట్టారు. బాపు తెరకెక్కించిన 'సాక్షి'తో తెలుగులో చిత్రపరిశ్రమలో ఆయన పబ్లిసిటీ పనులు ప్రారంభించారు. 'సాక్షి' సినిమా కలర్‌ పోస్టర్లు, లోగోను ఆయనే రూపొందించారు. బ్రష్‌ వాడకుండా నైఫ్‌ వర్క్‌తో 'పాప కోసం' చిత్ర పోస్టర్ల రూపకల్పన. హిందీ, తమిళ వెర్షన్లకు అదేరకం పోస్టర్ల రూపకల్పనతో గుర్తింపు పొందారు.

ఇదీ చూడండి..Prabhas Project K: 'ఆ రోజు నుంచే రెగ్యులర్​ షూటింగ్​'

Last Updated : Sep 21, 2021, 8:51 AM IST

ABOUT THE AUTHOR

...view details