రానా దగ్గుబాటి హీరోగా నటిస్తోన్న చిత్రం '1945'. ఇందులో సైనికుడి పాత్రలో కనిపించనున్నాడీ కథానాయకుడు. ఈ సినిమాను కొన్నేళ్ల క్రితమే చిత్రబృందం ప్రకటించింది. దీపావళి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను ఆదివారం విడుదలైంది. అయితే తొలిరూపుపై ఓ ట్వీట్ చేశాడు. ఇదో అసంపూర్ణమైన చిత్రమని అన్నాడు.
"ఇది ఓ అసంపూర్ణమైన చిత్రం. సినిమా రూపొందించే విషయంలో నిర్మాత విఫలమయ్యాడు. ఫలితంగా అసంపూర్ణంగానే ఉంది. సంవత్సరం నుంచి చిత్రబృందాన్ని కలవలేదు. పోస్టర్‌ను విడుదల చేయడమనేది డబ్బులు సంపాదన కోసం చేసిన మోసపూరిత ఆలోచనలా అనిపిస్తోంది. దయచేసి ఇలాంటి వాటిని ప్రోత్సహించకండి" -రానా, కథానాయకుడు