బాలీవుడ్ హిట్ సినిమా 'పింక్' మాదిరిగా 'తప్పడ్' నిలిచిపోతుందని హీరోయిన్ తాప్సీ అభిప్రాయపడింది. ఆమె నటించిన 'తప్పడ్' చిత్రం ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆమె సినిమా గురించి పలు అంశాలను పంచుకుంది.
''తప్పడ్' సినిమా సామాజిక అంశాలతో తెరకెక్కింది. దర్శకుడు అనుభవ్తో పనిచేయటం చాలా ఆనందంగా ఉంది. అతని నుంచి ఎంతో నేర్చుకున్నా. ఈ కథ చెప్పినప్పుడే నటించటానికి అంగీకరించాను. మన సమాజంలో తప్పక పరిష్కరించాల్సిన ఒక అంశంతో ఈ సినిమా రూపొందింది. పింక్ చిత్రంలా 'తప్పడ్' అందరిని ఆకట్టుకుంటోందని ఆశిస్తున్నా."
- తాప్సీ, బాలీవుడ్ నటి