తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథతో రూపొందిన పాన్ ఇండియా చిత్రం 'తలైవి'. ఎ. ఎల్. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. ఏప్రిల్ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది.
కంగన పుట్టినరోజున 'తలైవి' ట్రైలర్ - కంగన పుట్టినరోజున తలైవి ట్రైలర్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథతో రూపొందిన పాన్ ఇండియా చిత్రం 'తలైవి'. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించారు. ఈ నెల 23న ఆమె పుట్టినరోజు సందర్భంగా సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేయనుంది.
కంగన పుట్టినరోజున 'తలైవి' ట్రైలర్!
ఇందుకు కంగనా పుట్టినరోజు మార్చి 23ని ముహూర్తంగా ఖరారు చేశారు. ఆరోజున చెన్నై, ముంబయిలలో ట్రైలర్ విడుదల వేడుకలు నిర్వహించనున్నారు. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఎంజీఆర్‌గా అరవింద్ స్వామి.. కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్ కనిపించనున్నారు. శశికళగా పూర్ణ నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ స్వరాలందిస్తున్నారు. విష్ణు ఇందూరి శైలేష్ ఆర్. సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇదీ చూడండి:బోయపాటి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో?