టెన్ కమాండ్మెంట్స్.. 1956లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో విజువల్ వండర్‌గా తెరకెక్కింది. సిసెల్ బి డీమెల్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమా అతడి ఊహకు అద్భుత సృష్టి. గ్రాఫిక్స్ అంతగా లేని ఆ రోజుల్లోనే ఎర్రసముద్రాన్ని రెండుగా చీల్చే సన్నివేశంతో ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇచ్చాడు. అప్పట్లోనే వంద కోట్లకు పైగా ఖర్చుపెట్టి తీసిన ఈ చిత్రం అంతకు పదింతల వసూళ్లను రాబట్టింది.
సముద్రాన్ని ఇలా చీల్చారు...
ఈ సీన్‌కోసం దర్శకుడు ఎంతో శ్రమించాడట. హాలీవుడ్లో వేసిన ప్రత్యేక సెట్లో.. సముద్రం రెండుగా చీలినట్లుగా చూపించేందుకు పెద్ద ట్యాంకుల్లోంచి దాదాపు మూడు లక్షల గ్యాలన్ల నీటిని వినియోగించారు. నీరు పై నుంచి పోస్తూ.. ఫిల్మ్ ఫుటేజిని రివర్స్‌లో రన్ చేశారట. సముద్రపునీరుగా కనిపించేందుకు ట్యాంకుల్లో జిలాటిన్‌ను కలిపారట. కెమెరా టెక్నిక్స్, కొద్దిపాటి గ్రాఫిక్స్‌తో తెరపై వీక్షించిన ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశారు.
క్రీస్తుపూర్వం ఎక్సోడస్ అనే పుస్తకం ఆధారంగా టెన్ కమాండ్మెంట్స్ చిత్రాన్ని తీశారు. ఈ సినిమా ఎంత విజయం సాధించిందంటే ఉత్తమ పది అమెరికా చిత్రాల్లో చోటు దక్కించుకుంది. ఏడు ఆస్కార్ అవార్డులకు నామినేటైంది. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అకాడమీ అవార్డు దక్కించుకుంది.
ఇది చదవండి: 'కలిసే వ్యక్తుల్ని బట్టి దారి దొరుకుతుంది'