తమిళనాడులోని హీరో విజయ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖుల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారుల దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 38 చోట్ల ఈ సోదాలు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తంగా దాదాపు రూ.300 కోట్ల అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నామని, ఐటీ అధికారులు గురువారం వెల్లడించారు.
సినీ ప్రముఖుల వద్ద రూ.300 కోట్ల అక్రమ నగదు - kollywood news
తమిళనాడులో సినీ ప్రముఖుల ఇళ్లపై జరుగుతున్న ఐటీ దాడుల్లో సుమారు రూ.300 కోట్ల మేర నగదు లభ్యమైంది. హీరో విజయ్‌కు సంబంధించిన ఆస్తులపై ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.
హీరో విజయ్
హీరో విజయ్ ఆదాయం, ఆస్తులు, రెమ్యూనరేషన్, 'బిగిల్' నిర్మాణంలో అతడికున్న సంబంధం తదితర అంశాలపై ఇతడిని ప్రశ్నించారు ఐటీ అధికారులు. విజయ్ 'బిగిల్' సినిమాకు ఫైనాన్స్ చేసిన అన్బు చెళియన్, అతడి స్నేహితుల నుంచి రూ.65 కోట్లు సీజ్ చేశారు అధికారులు.
Last Updated : Feb 29, 2020, 10:50 AM IST