తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఖైదీ' దర్శకుడితో పనిచేసేందుకు సూర్య గ్రీన్​సిగ్నల్​

తనదైన నటనతో దక్షిణాదిన ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు నటుడు సూర్య. విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ హీరో... తన తమ్ముడు కార్తీకి మంచి విజయాన్నిచ్చిన దర్శకుడి​తో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాడట. 'ఖైదీ' లాంటి డిఫరెంట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్​ లోకేష్‌ కనకరాజ్‌తో ఓ చిత్రానికి సూర్య ఓకే చెప్పినట్లు సమాచారం.

'ఖైదీ' దర్శకుడితో పనిచేసేందుకు సూర్య గ్రీన్​సిగ్నల్​

By

Published : Nov 1, 2019, 5:16 AM IST

వెండితెరపై ఆకట్టుకున్న చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్‌ చేయడం.. ఆ చిత్ర దర్శకుడుతో సినిమా చేసేందుకు కథానాయకులు ఆసక్తి చూపడం సహజం. ప్రముఖ తమిళ నటుడు సూర్య ఇదే మార్గాన్ని ఎంచుకున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

ఈ స్టార్​ హీరో సోదరుడు కార్తీ ఇటీవల నటించిన చిత్రం 'ఖైదీ'. దీపావళి కానుకగా తెలుగులోనూ విడుదలై మంచి విజయం అందుకుంది. విభిన్న కథాంశంతో ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు లోకేష్‌ కనకరాజ్​. దీనిపై ప్రశంసలు వస్తుండగా... సూర్య కూడా ఈ యువ దర్శకుడి పనితనానికి మెచ్చి ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పేశాడట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో 'సూరరై పోట్రు' చిత్రంలో నటిస్తున్నాడు సూర్య. దీనితో పాటు వెట్రిమారన్‌ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నట్లు సమాచారం.

రెండే సినిమాలు చేసిన లోకేష్‌ కనకరాజ్‌కు కోలీవుడ్​లో 'ఖైదీతో' మంచి పేరు వచ్చింది. ఫలితంగా పెద్ద హీరోల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా కోలీవుడ్​ స్టార్​ హీరో విజయ్‌ కూడా ఇతడికి ఓ ఛాన్స్​ ఇచ్చాడు. ఈ యువ దర్శకుడితోనే తన 64వ చిత్రం చేస్తున్నట్లు వెల్లడించాడు.

ABOUT THE AUTHOR

...view details