తెలంగాణ

telangana

విజయ్​ 'మాస్టర్'​ టీజర్​  అదిరిందిగా..

తమిళ స్టార్​ హీరో విజయ్​ నటించిన 'మాస్టర్'​ సినిమా టీజర్​ను విడుదల చేసింది చిత్రబృందం. సినీప్రియులను ఈ టీజర్​ ఆకట్టుకునేలా ఉంది.

By

Published : Nov 14, 2020, 7:18 PM IST

Published : Nov 14, 2020, 7:18 PM IST

Updated : Nov 14, 2020, 7:39 PM IST

master
మాస్టర్

దీపావళి సందర్భంగా తమిళ కథానాయకుడు విజయ్‌ నటించిన 'మాస్టర్‌' సినిమా టీజర్​ను విడుదల చేసింది చిత్రబృందం. 'నాకు తెలుసు సర్‌.. జేడీ ఒక నేరస్థుడు. అయినా.. ఒక సాధారణ అధ్యాపకుడు ఇంత ప్రమాదకరమైన వ్యక్తిగా ఎందుకు మారాడు..?' అనే డైలాగ్‌తో టీజర్​ ప్రారంభమైంది. ఫైటింగ్​ సన్నివేశాలతో ఈ వీడియో​ ఆద్యంతం సినిమాపై అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. . ఇందులో హీరో విజయ్‌ ఒక స్టైలిష్‌, పవర్‌ఫుల్‌ ప్రొఫెసర్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు.

లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వం వహించారు. మాళవికా మోహనన్‌ కథానాయిక. విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా నటించారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు. భాగ్యరాజ్‌, అర్జున్‌ దాస్‌, సిమ్రన్‌, ఆండ్రియా, శ్రీనాథ్‌, సంజీవ్‌ గౌరీ కిషన్‌, వీజే రమ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. మరి ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.

ఇదీ చూడండి : బాదం ఆకుల కోసం ఆగిన సినిమా షూటింగ్​!

Last Updated : Nov 14, 2020, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details