లాక్డౌన్ తర్వాత వరుస చిత్రాలతో దూసుకుపోతోంది నటి తాప్సీ పన్ను. ఇప్పటికే మూడు చిత్రాల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ మరో సినిమాకు సిద్ధమైంది. ఇటీవల 'లూప్ లపేటా' చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించిన విశేషాలు పంచుకుంది తాప్సీ.
"నేను కొన్ని సినిమాల వెంట పడ్డాను. కొన్ని నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. ఈ చిత్రం విషయంలో రెండోదే జరిగింది. అందుకు 'లూప్ లపేటా' చిత్ర బృందానికి నేను రుణపడి ఉంటాను." అని చిత్రీకరణకు సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది తాప్సీ.
'లూప్ లపేటా'ను1998లో జర్మనీలో వచ్చిన 'రన్ లోలా రన్' ఆధారంగా తీస్తున్నారు. దాని కన్నా ముందే 'హసీన్ దిల్రుబా', 'రష్మీ రాకెట్' చిత్రీకరణ పూర్తి చేసింది తాప్సీ. ఇక ఇప్పుడు భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న 'శభాష్ మిథు'చిత్రం కోసం శిక్షణ తీసుకోనుంది తాప్సీ.
తాప్సీ నటిస్తున్న చిత్రాలు
నటి ఊర్వశి రౌతేలా ఓ మ్యూజిక్ వీడియోలో నటించనుంది. రాపర్, సంగీత దర్శకుడు గురు రంధావాతో కలిసి 'మర్ జాయేంగే' అనే పాటలో మెరవనుంది. సాహిత్యం బి ప్రాక్, జానీ అందించగా, భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.
ఇదీ చూడండి:నా పెళ్లి వార్త నిజమే: మెహరీన్