హీరోయిన్ తాప్సీ పన్ను, దర్శకుడు అనురాగ్ కశ్యప్ కాంబినేషన్లో కొత్త చిత్రానికి రంగం సిద్ధమైంది. వీరిద్దరూ కలిసి నటిస్తోన్న సినిమా గురించి తాజాగా అప్డేట్ వచ్చింది. 'దోబారా' అనే సినిమా కోసం అనురాగ్‌తో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది తాప్సీ. దానికి సంబంధించిన వీడియో చూస్తే టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.
టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తాప్సీ కొత్త చిత్రం - తాప్సీ అనురాగ్ కశ్యప్ కొత్త చిత్రం
తాప్సీ హీరోయిన్గా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. తాజాగా దానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం.
టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తాప్సీ సినిమా
తాప్సీ, అనురాగ్.. 2018లో విడుదలైన 'మన్మర్జియాన్' చిత్రం కోసం కలిసి పనిచేశారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనురాగ్‌తో ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కోసం పనిచేయబోతున్నట్లు వెల్లడించింది తాప్సీ.